vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 4:24 pm Posted by : వార్తా జిఎస్‌బి

అంగరంగ వైభవంగా జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పశువుల్లంకలో ఘనంగా నిర్వహించిన పుట్టినరోజు సంబరాలు

ఐ. పోలవరం, సెప్టెంబర్ 02 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు కాశి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఐ. పోలవరం మండలం పశువుల్లంక గ్రామంలో జనసేన నాయకులు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జనసేన నాయకుడు అద్దంకి గౌరీశంకర్ మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజా సేవే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు.

ఈ ఘనమైన జన్మదిన వేడుకల్లో ఐ. పోలవరం మండల ప్రెసిడెంట్ మద్దింశెట్టి పురుషోత్తం, మార్కెటింగ్ చైర్మన్ భాగ్యశ్రీ, ముమ్మిడివరం మండల ప్రెసిడెంట్ దూల స్వామి, నియోజకవర్గ నాయకులు, పశువుల్లంక గ్రామ కమిటీ సభ్యులు, అద్దంకి గౌరీశంకర్, మార్త భాస్కరరావు, మండల జనసేన ప్రెసిడెంట్ సవరపు వెంకట్తో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పశువుల్లంక గ్రామంలో వేడుకలు సందడిగా కొనసాగాయి.