అంగరంగ వైభవంగా జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పశువుల్లంకలో ఘనంగా నిర్వహించిన పుట్టినరోజు సంబరాలు

ఐ. పోలవరం, సెప్టెంబర్ 02 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు కాశి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఐ. పోలవరం మండలం పశువుల్లంక గ్రామంలో జనసేన నాయకులు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు అద్దంకి గౌరీశంకర్ మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు....