అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి ముమ్మిడివరంలో దళిత సంఘాల నిరసన.. పోలీసు, రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు
ముమ్మిడివరం ఆగస్ట్ 03 ( రిపోర్టర్ వేణు కాశి)..ఆర్. అంబేడ్కర్‌పై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నాగులారపు వర ప్రసాద్ అలియాస్ హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘాల ఆధ్వర్యంలో ముమ్మిడివరంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముమ్మిడివరం, అయినవిల్లి మండలాల పరిధిలోని పొట్టిలంక, కొండుకుదురు, లంకాఫ్ ఠాణేలంక, కమిని తదితర లంక గ్రామాలకు చెందిన దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ముమ్మిడివరం...