అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి ఐ. పోలవరం మాల మహానాడు జేఏసీ డిమాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దిష్టిబొమ్మ దహనం.. పోలీస్ స్టేషన్‌కు భారీ ర్యాలీ.. ఐ. పోలవరం ఎస్ ఐ. ఎమ్ . రవీంద్ర బాబు కు వినతి పత్రం అందజేసారు..

ఐ. పోలవరం, సెప్టెంబర్ 5 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐ. పోలవరం మండల మాల మహానాడు జేఏసీ, రిపబ్లికన్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఐ. పోలవరం మండలంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత ఇంజరం హైవేపై ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్దకు మాల మహానాడు జేఏసీ...