ఐ. పోలవరం, సెప్టెంబర్ 5 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐ. పోలవరం మండల మాల మహానాడు జేఏసీ, రిపబ్లికన్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
పాత ఇంజరం హైవేపై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జేఏసీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం భారీ ర్యాలీగా ఐ. పోలవరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ ఎం. రవీంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. హమారా ప్రసాద్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలను నిర్ధారించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
అంబేద్కర్ రాజ్యాంగం, ఆయన ఆశయాలను కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని నాయకులు తెలిపారు. తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు రేవు శ్రీను, ఆర్‌పీఐ జిల్లా అధ్యక్షుడు చీకురుమల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఉచ్చల సాల్మన్ రాజు, పంతగడి నరసింహమూర్తి, గిడ్డి ప్రసాద్, కాశి సిద్ధార్థ కుమార్, రిటైర్డ్ ఎస్‌ఐ బి. వెంకటేశ్వర్లు, వడ్డీ గౌతమ్, దున్నా సుబ్బారావు, మట్టా గగనవీరుడు, బీర సత్యనారాయణ, ములపర్తి శ్రీనుబాబు, జనపల్లి విప్లవ్ కుమార్, మోర్త ధనకాసులు, సాధనాల బాబురావు, గెల్లా శ్రీనుబాబు, పునుగుమట్ల మూర్తి, నాగాబత్తుల రామకృష్ణ, పండు విజయకుమార్, పండు మురళీ, మోకా వెంకట్, గుత్తాల దుర్గాప్రసాద్, కన్నెడి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.




