అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. హమారా ప్రసాద్‌పై చర్యలకు డిమాండ్ ఐ. పోలవరం మాల మహానాడు జేఏసీ నిరసన.. దిష్టిబొమ్మ దహనం ఎస్‌ఐ ఎం. రవీంద్రబాబుకు వినతిపత్రం అందజేత
ఐ. పోలవరం, సెప్టెంబర్ 5 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐ. పోలవరం మండల మాల మహానాడు జేఏసీ, రిపబ్లికన్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పాత ఇంజరం హైవేపై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జేఏసీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం భారీ ర్యాలీగా...