vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 12:08 pm Posted by : వార్తా జిఎస్‌బి

అక్షరజ్ఞానం అందించే అక్షయపాత్రగా ప్రత్యక్ష దైవం,గురువులు.. వైద్య శిక్షణ ఇచ్చిన  డాక్టర్ చెలికాని స్టాలిన్ కు శిష్యులు గురుపూజ

అక్షరజ్ఞానం అందించే అక్షయపాత్రగా ప్రత్యక్ష దైవం,గురువులు..

వైద్య శిక్షణ ఇచ్చిన

డాక్టర్ చెలికాని స్టాలిన్ కు శిష్యులు గురుపూజ

రామచంద్ర పురం (జిఎస్ బి వార్త)

రామచంద్రపురం లో సీనియర్ వైద్యులు, జననాట్యమండలి రాష్ట్ర నాయకులు చెలికాని స్టాలిన్ ను వారి శిష్యులు గురువారం మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ వైద్యం లో తమజీవనం తో సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులు కొత్తలంక సతీష్ బాబు, ఎన్ ఎస్ ప్రకాష్ ,గునిపే శోభన్ బాబు తదితరులు గురువారం డాక్టర్ స్టాలిన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా రామచంద్రపురం లో ప్రముఖ సీనియర్ వైద్యులు, జననాట్యమండలి రాష్ట్ర నాయకులు, కమల నర్సింగ్ హోమ్ వైద్యులు చెలికాని స్టాలిన్ ను గురుపౌర్ణమి సందర్బంగా వారి వద్ద వైద్యం తో పాటు, సంఘ సేవకు తర్పిదు పొందిన శిష్యులు కృతజ్ఞతగా ప్రతి ఏడాది తుచా తప్పకుండ కలుస్తున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ స్టాలిన్ మాట్లాడుతూ సమాజం లో వైద్య సేవకు మించిoది మరొకటి లేదని, విలువలుతో కూడిన వైద్య సేవలు తో పాటు ఎప్పటికప్పుడు వైద్య మెలుకువలు పెంపొందించుకోవాలని సూచించారు.తమ ఎదుగుదల కు వారి నైపుణ్యం అందించి, అక్షరజ్ఞానం అందించే అక్షయపాత్రగా ప్రత్యక్ష దైవం,గురువులు గా భావించడం రాబోవు తరాలకు సందేశం అందించాలని నిరూపిస్తున్నారు.  ఈ కార్యక్రమం లో డాక్టర్ చెలికాని రామారావు,డాక్టర్ కవిత, తదితరులు పాల్గొన్నారు.