అభిమానం ఉండాలి… కానీ ప్రాణాలను బలితీసుకునే ఉన్మాదం కాదు..! –కాశి రామకృష్ణ
ఐ. పోలవరం సెప్టెంబర్ 02 ( జియస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి) సినిమా హీరోల సినిమా విడుదలలు అయినా... రాజకీయ నాయకుల పుట్టినరోజులు అయినా... రాజకీయ ఊరేగింపులు, ఇతర ర్యాలీలు అయినా... కొందరు యువత రోడ్లపై చేస్తున్న ప్రమాదకరమైన విన్యాసాలు చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతోంది. బైక్‌లపై పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్లడం... సైలెన్సర్లను మార్చి భయానక శబ్దాలతో రోడ్లపై హంగామా చేయడం... ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా ఒకరిని చూసి మరొకరు పోటీ పడటం... క్షణికానందం కోసం ప్రాణాలతో చెలగాటమాడటం నిత్యకృత్యంగా...