అర్ణబ్ తుఫాన్‌తో దెబ్బతిన్న వరి పొలాల పరిశీలన.. రైతుల గోడు విన్న కేంద్ర బృందం! పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ దెబ్బ.. రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి నష్టం కౌలు రైతులను ఆదుకోవాలి.. ఎండోమెంట్ భూముల శిస్తు రద్దు చేయాలని విజ్ఞప్తి
తాళ్లరేవు: నవంబర్ 01( జీఎస్ బి వార్త ) అర్ణబ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వరి పంట పొలాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ పరిధిలోని బాపనపల్లి గ్రామంతో పాటు కాజులూరు మండలం కోలంక ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావానికి దెబ్బతిన్న వరి పొలాలను బృంద సభ్యులు సందర్శించి పంట నష్టం తీవ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులతో...