ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మున్సిపల్ కమిషనర్ ఎన్.వి. సత్యనారాయణ* : *మానవతా దృక్పథంపై సర్వత్రా ప్రశంసలు*
కాకినాడ సిటీ నవంబర్ 6 జి ఎస్ బి వార్త భారీ వర్షాల ధాటికి సర్వం కోల్పోయి అల్లాడుతున్న ఓ నిరుపేద కుటుంబానికి మున్సిపల్ కమిషనర్ ఎన్.వి. సత్యనారాయణ దేవుడిలా అండగా నిలిచారు. రోడ్డు ఎత్తుగా ఉండటం, ఇల్లు పల్లంలో ఉండటంతో వర్షపు నీరు ఇంట్లోకి చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభాకర్, ఆ ఇంట్లో మంచానికే పరిమితమైన (బెడ్ రిడెన్) సోదరి దీనస్థితిని చూసి కమిషనర్ చలించిపోయారు. కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా, స్వయంగా రంగంలోకి దిగి మానవతా దృక్పథంతో తక్షణ...