ఇల్లు వదిలి బయటకు వెళ్లేటప్పుడు
పోలీస్ వారి హెచ్చరిక
కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ డి ఎస్ చైతన్య కృష్ణ
కాకినాడ, (జిఎస్ బి వార్త )
మీరు ఇల్లు వదిలి బయటకు వెళ్లేటప్పుడు *తాళం కప్పలు ప్రధాన ద్వారాలు గాని, గేట్ల గాని దొంగలకు కనిపించే విధంగా వేయవద్దని కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ పోలీస్ డి ఎస్ .చైతన్య కృష్ణ హెచ్చరించారు.ఈ సందర్బంగా ఆయన ప్రకటన విడుదల చేశారు.తాళం కప్పలు గేట్లకు ప్రధాన ద్వారాలకు కనిపించేలా వేసినట్లయితే దొంగలకు మీరు ఇంట్లో లేని సమాచారం సులువుగా తెలుస్తుందని కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ లామంది దొంగలు దొంగతనం చేసిన తర్వాత పోలీసు వారికి పట్టుబడినప్పుడు ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు అన్న విషయాన్ని దొంగలకు తాళం కప్పల ద్వారానే గుర్తిస్తున్నట్లు ఇంటరాగేషన్లో చెప్పడం జరిగింది, కాబట్టి కాలనీ వాసులందరూ ఇల్లు వదిలి బయటకు వెళ్ళేటప్పుడు తాళం కప్పలు గేట్లు గాని ప్రధాన ద్వారాలు గాని దొంగలకు కనిపించే విధంగా వేయవద్దని కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ డి ఎస్ .చైతన్య కృష్ణ హెచ్చరిక జారిచేశారు.