ఎంపీపీ, ఎంపీటీసీల నల్ల బ్యాడ్జీలతో నిరసన మూడేళ్లుగా గౌరవ వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ. పోలవరం మండలం: ఐ. పోలవరం ( జియస్ బి వార్త వేణు కాశి) మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సాధారణ సమావేశంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఎంపీపీలు, ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు రావాల్సిన గౌరవ వేతనాలు ఇప్పటివరకు అందలేదని పేర్కొన్నారు. తమ పదవీకాలం...