ఎంపీపీ, ఎంపీటీసీల నల్ల బ్యాడ్జీలతో నిరసన

ఎంపీపీ, ఎంపీటీసీల నల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ. పోలవరం: ఐ. పోలవరం(జియస్ బి వార్త వేణు కాశి) మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సాధారణ సమావేశంలో ఎంపీపీ, వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఎంపీపీలు, ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవలు అందిస్తూ విధులు నిర్వహిస్తున్నప్పటికీ, తమకు రావాల్సిన గౌరవ వేతనాలు ఇప్పటివరకు...