vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 8:54 am Posted by : వార్తా జిఎస్‌బి

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై విమర్శలు.. టీడీపీ జెండా స్తూపానికి ముసుగు ఏదీ?

ఐ. పోలవరం, అక్టోబర్ 17 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ. పోలవరం మండలం పాత ఇంజరం పంచాయతీ పరిధిలోని ఎదురులంక హైవే సమీపంలో, బాలయోగి ఘాట్ ఎదురుగా ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా స్తూపానికి ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ముసుగు వేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్‌ నిబంధనలను పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.