vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 12:21 pm Posted by : వార్తా జిఎస్‌బి

ఎముకలను క్షీణింపజేసే ధూమపానం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి… డా బొండ సూర్యారావు 

ఎముకలను క్షీణింపజేసే ధూమపానం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి…

డా బొండ సూర్యారావు

కాకినాడ, (జిఎస్ బి వార్త )

కాకినాడ సన్ రైజ్ ఆసుపత్రిలోజాతీయ ఎముక మరియు కీళ్ల దినోత్సవం సందర్భంగా డా బొండ సూర్య రావు మరియు డా అడ్డాల సత్యనారాయణ చే ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్యులు డా అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ “ఈ దినోత్సవాన్ని భారతదేశంలో ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ 2012లో ప్రారంభించిందని, ​ఆగస్టు 4న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారని, “స్ట్రాంగర్ బోన్స్, స్ట్రాంగర్ ఇండియా” అనేది ఈ దినోత్సవానికి సంబంధించిన నినాదం అని,  ఆస్టియోపోరోసిస్ (ఎముకలు పెళుసుబారడం), ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యల గురించి ప్రజలను అప్రమత్తం చేయడం,అలాగే ఆస్టియోపోరోసిస్ మరియు దంత ఆరోగ్యం మధ్య చాలా బలమైన, ప్రత్యక్ష సంబంధం ఉందని, ఆస్టియోపోరోసిస్ అనేది కేవలం కాళ్లు, చేతుల ఎముకలను మాత్రమే కాకుండా, దవడ ఎముకను కూడా ప్రభావితం చేస్తుందని ,ఎముకలను క్షీణింపజేసే ధూమపానం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు.​ఎముకల వైద్య నిపుణులు డా బొండ సూర్య రావు మాట్లాడుతూ”​ఆరోగ్యకరమైన ఎముకలు, కీళ్ల ,కోసం క్యాల్షియం, విటమిన్-డి చాలా అవసరమని, పాలు, పెరుగు, పచ్చి ఆకుకూరలు, మరియు డ్రై ఫ్రూట్స్ తరచుగా తీసుకోవాలని, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా ఏరోబిక్స్ చేయడం వల్ల కీళ్లు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయని బరువులు ఎత్తే వ్యాయామాలు ఎముకల సాంద్రతను పెంచుతాయని, ​ఉదయం పూట ఎండ శరీరానికి తగిలేలా చూసుకోవడం వల్ల సహజంగా విటమిన్-డి అందుతుందని, మోకాళ్లపై అదనపు భారం పడకుండా ఉండాలంటే శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమని, వయసు పైబడిన వారు (ముఖ్యంగా 40-50 ఏళ్లు దాటిన మహిళలు) క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని,బలమైన ఎముకలే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజలు, రిబ్కా రాణీ, గాయత్రి, రమ్య, నాగవల్లి పాల్గొన్నారు.