vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 9:34 am Posted by : వార్తా జిఎస్‌బి

ఎస్సీ మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన నాయకుడు వైఎస్‌ జగన్‌! ఐ. పోలవరం మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలను ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయింపు కూటమి ప్రభుత్వంలో ఎస్సీ మాదిగలకు అన్యాయం జరుగుతోందని డిల్లీ నారాయణ విమర్శ

ఐ. పోలవరం, అక్టోబర్ 23 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):

ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కల్పించి, రాజకీయంగా సముచిత ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సత్యనారాయణ (డిల్లీ నారాయణ) అన్నారు.

ఐ. పోలవరం మండలంలోని కేసనకుర్రు, ఎదురుల్లంక, పాత ఇంజరం, టి.కొత్తపల్లి ఎంపీటీసీ స్థానాలను ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించినట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో వారికి రాజకీయ అవకాశాలు లభించాయని పేర్కొన్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత పెరిగిందని డిల్లీ నారాయణ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కల్పించడం ద్వారా ఆ వర్గం రాజకీయ ప్రాతినిధ్యం బలోపేతం కావడానికి దోహదపడిందని తెలిపారు.

కూటమి ప్రభుత్వంలో ఎస్సీ మాదిగలకు అన్యాయం జరుగుతోందని విమర్శ

ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి ఆశించిన స్థాయిలో న్యాయం జరగడం లేదని డిల్లీ నారాయణ విమర్శించారు. సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, వారి హక్కులు, అవకాశాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ విధానాలపై విమర్శలు చేసిన ఆయన, చంద్రబాబు రాజకీయాలు వెన్నుపోటు ధోరణితో సాగుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించి, వారి అభ్యున్నతికి కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సత్యనారాయణ (డిల్లీ నారాయణ) కోరారు.