ఎస్సీ మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన నాయకుడు వైఎస్ జగన్! ఐ. పోలవరం మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయింపు కూటమి ప్రభుత్వంలో మాదిగలకు న్యాయం జరగదని డిల్లీ నారాయణ విమర్శ
ఐ. పోలవరం, అక్టోబర్ 23 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కల్పించి, రాజకీయంగా సముచిత స్థానం కల్పించిన నాయకుడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సత్యనారాయణ (డిల్లీ నారాయణ) అన్నారు. ఐ. పోలవరం మండలంలో కేసనకుర్రు, ఎదురుల్లంక, పాత ఇంజరం, టి. కొత్తపల్లి ఎంపీటీసీ స్థానాలను ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో...