vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 10:37 am Posted by : వార్తా జిఎస్‌బి

ఏపీలో మహిళా మత్స్య సహకార సంఘాల ప్రస్తుత స్థితిగతులు, అభివృద్ధిపై రాజ్యసభలో ప్రశ్నించిన ఎంపీ సానా సతీష్ బాబు*

*ఏపీలో మహిళా మత్స్య సహకార సంఘాల ప్రస్తుత స్థితిగతులు, అభివృద్ధిపై రాజ్యసభలో ప్రశ్నించిన ఎంపీ సానా సతీష్ బాబు*

 

*ఏపీలో 213 మహిళా మత్స్య సహకార సంఘాలు ద్వారా 27,447 మంది మహిళలు లబ్ధి పొందుతున్నట్లుగా కేంద్రం వెల్లడి*

 

*న్యూఢిల్లీ, జూలై 22*: *ఏపీలో తీరప్రాంత మహిళల ఆధ్వర్యంలో మత్స్య సహకార సంఘాల ఏర్పాటు, వాటి ద్వారా మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, భవిష్యత్ కార్యాచరణ*పై వివరాలు తెలియజేయాలని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో బుధవారం రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

 

*మత్స్య పరిశ్రమ, సముద్రపు ఆల్గీ (Seaweed) సాగు, మెరైన్ ప్రాసెసింగ్ రంగాల్లో మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటైన సహకార సంఘాల జిల్లాల వారీ, సంవత్సరాల వారీ వివరాలతో పాటు*, *వాటిలో సభ్యులుగా ఉన్న మహిళల సంఖ్య*, *వారి సామాజిక-ఆర్థిక స్థితిగతుల* పై సమాచారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

 

దీనికి కేంద్ర మత్స్య శాఖా మంత్రి స్పందిస్తూ, *ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య పరిశ్రమ, సీవీడ్ సాగు, మెరైన్ ప్రాసెసింగ్ రంగాల్లో మొత్తం 213 మహిళల మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేసినట్లు* వెల్లడించింది.

 

వీటి ద్వారా రాష్ట్రంలోని *12 జిల్లాల్లో 27,447 మంది మహిళలు లబ్ధి పొందుతున్నట్లు* తెలిపింది. 2021 ఏప్రిల్ 1 నుంచి 2026 జూన్ 15 వరకు ఏర్పాటైన ఈ సంఘాల జిల్లా వారీ వివరాలను కూడా సభకు సమర్పించింది.

 

అదే విధంగా, మహిళల ఆధ్వర్యంలోని మత్స్య సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. *ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY)* కింద అధిక ప్రోత్సాహకాలు, జాతీయ మత్స్య డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు, సామర్థ్యాభివృద్ధి, ఆర్థిక సహాయం, మార్కెట్ అనుసంధానం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించింది. అలాగే *12 వేల మత్స్య సహకార సంఘాల బలోపేతానికి జాతీయ కార్యాచరణ ప్రణాళిక* రూపొందించినట్లు పేర్కొంది.