కాకినాడ(జి ఎస్ బి వార్త)కాకినాడ ఇండిపెండెంట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రథమ సమావేశం కాకినాడలో నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు బాలెం నూకరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యూనియన్ బలోపేతానికి చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళిక పై చర్చించారు.
జర్నలిస్టులకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు లేబర్ యాక్ట్ పరిధిలో తీసుకెళ్లినప్పుడే సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. ఈ సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు పితాని వెంకట రాము, జిల్లా కార్యదర్శి కర్రి రామకృష్ణారెడ్డి, కోశాధికారి అగ్రహారపు జయ శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.