ఐ. పోలవరంలో వైఎస్సార్సీపీ శ్రేణుల బైక్ ర్యాలీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్‌కు నాయకులు, కార్యకర్తల భారీ ర్యాలీ మాజీ సొసైటీ అధ్యక్షుడు భూపతిరాజు చంటిబాబు ఆశీస్సులు తీసుకున్న అభ్యర్థులు
ఐ. పోలవరం, అక్టోబర్ 23 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): ఐ. పోలవరం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఐ. పోలవరం పెదమడి ప్రాంతం నుంచి పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా బయలుదేరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ సర్పంచ్ దంతులూరి రాఘవరాజు, విత్తనాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగింది. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి...