ఐ. పోలవరం ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి నాగమణి ఘన విజయం 508 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం.. జనసేన శ్రేణుల్లో సంబరాలు
జీఎస్బీ వార్త | రిపోర్టర్ వేణు కాశి ఐ. పోలవరం: ఐ. పోలవరం మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ అభ్యర్థి నాగమణి 508 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం సాధించి ప్రజల మద్దతుతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. నాగమణి సాధించిన ఈ విజయంతో ఐ. పోలవరం మండలంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ శ్రేణులు అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు....