ఐ. పోలవరం ఎంపీటీసీ-1 బరిలో జనసేన నుంచి రాయపురెడ్డి నాగ దుర్గా దేవి! కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థుల సహకారం కోరిన రాయపురెడ్డి సిద్ధూ
ఐ. పోలవరం, అక్టోబర్ 17 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ.పోలవరం మండల ఎంపీటీసీ-1 స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున రాయపురెడ్డి నాగ దుర్గా దేవి పోటీ బరిలో నిలవనున్నట్లు రాయపురెడ్డి సిద్ధూ వెల్లడించారు. ఆమె అభ్యర్థిత్వం నేపథ్యంలో స్థానికంగా రాజకీయ చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సందర్భంగా రాయపురెడ్డి సిద్ధూ మాట్లాడుతూ, జనసేన పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు సమన్వయంతో సహకరించి నాగ దుర్గా దేవికి మద్దతు...