ఐ.పోలవరం జడ్పీటీసీగా బీర సత్యకుమారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఓటర్లకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు విజ్ఞప్తి
ఐ.పోలవరం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐ.పోలవరం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న బీర సత్యకుమారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామగ్రామాన అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా...