ఐ. పోలవరం జెడ్పీటీసీ బరిలో సఖిలే పద్మావతి.. ఇంటింటా విస్తృత ప్రచారం! ప్రతి గడపకూ చేరుతూ ఓటర్లతో మమేకం.. తమ అమూల్యమైన ఓటు వేసి ఆదరించాలని అభ్యర్థన

ఐ. పోలవరం: ఐ. పోలవరం మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సఖిలే పద్మావతి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మండల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటా పర్యటిస్తూ ఓటర్లను నేరుగా కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ప్రతి గడపకూ వెళ్లి ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడుతున్న ఆమె, తనను జెడ్పీటీసీ అభ్యర్థిగా ఆదరించి, తమ అమూల్యమైన ఓటును వేసి ఆశీర్వదించాలని కోరుతున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి అభిప్రాయాలను వింటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలను కలుస్తూ సాగుతున్న ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ...