vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 2:43 pm Posted by : వార్తా జిఎస్‌బి

ఐ. పోలవరం పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి మార్గదర్శకం

ఐ. పోలవరం పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం

ఉపాధ్యాయుల సేవలు సమాజానికి మార్గదర్శకం

ఐ. పోలవరం: సెప్టెంబర్  05 ( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను ఐ. పోలవరం శ్రీ వేగిరాజు నారాయణరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. విద్యార్థులకు విద్యాబోధన అందించడమే కాకుండా, వారి వ్యక్తిత్వ వికాసానికి, భవిష్యత్తు నిర్మాణానికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఎంతో విలువైనదని పలువురు పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ప్రతి విద్యార్థిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడంలో గురువుల మార్గదర్శకత్వం ఎంతో అవసరమని అన్నారు.

అనంతరం ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి సేవలను అభినందించారు. విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల పట్ల తమ గౌరవాన్ని చాటుకుంటూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీధి సురేష్ బాబు, పాఠశాల కో-ఆప్టెడ్ మెంబర్ సాగిరాజు సూరిబాబు రాజు, విద్యా కమిటీ చైర్మన్ గోలిశెట్టి వీర్రాజు, ఇందుగుల సూరిబాబు, ర్యాలీ ప్రకాష్ తదితరులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.