vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 2:05 pm Posted by : వార్తా జిఎస్‌బి

ఐ. పోలవరం మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల సందడి టీడీపీ తరఫున ఐదు నామినేషన్లు.. వైసీపీ తరఫున ఒక నామినేషన్ దాఖలు

 

ఐ. పోలవరం, అక్టోబర్ 21 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐ. పోలవరం మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు రిటర్నింగ్ అధికారి ఎం. వెంకట రామారావు బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు.

ఈ సందర్భంగా మండలంలోని వివిధ ఎంపీటీసీ స్థానాలకు పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎదుర్లంక ఎస్సీ జనరల్ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున చిల్లా సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. మురమళ్ల అన్‌రిజర్వుడ్ మహిళా స్థానానికి టీడీపీ తరఫున పితాని సుజాత, అరుణ గంజా నామినేషన్లు సమర్పించారు.

అలాగే, జి. మూలపొలం అన్‌రిజర్వుడ్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాటం సత్తిరాజు నామినేషన్ దాఖలు చేశారు. కేశనకుర్రు–3 అన్‌రిజర్వుడ్ మహిళా స్థానానికి టీడీపీ తరఫున కర్నీడి అనంత రామలక్ష్మి, కేశనకుర్రు–4 ఎస్సీ రిజర్వుడు స్థానానికి టీడీపీ తరఫున నేరేడిమిల్లి గౌతమ్ శేఖర్ నామినేషన్లు సమర్పించారు.

మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయా స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో మండలంలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది.