ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్
భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్ 07( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)జి.మూలం గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రగరువు–భీమ్‌నగర్ పాఠశాల హెచ్‌ఎం ఎస్. అమీన్ ఐ.పోలవరం మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రగరువు–భీమ్‌నగర్ అంబేద్కర్ యంగ్‌మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఎస్. అమీన్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను...