vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 1:57 am Posted by : వార్తా జిఎస్‌బి

కరప మండలం నుండి భారీ ఎత్తున వైస్సార్సీపీ నాయకులు బీజేపీ పార్టీ లో చేరికలు

కరప మండలం నుండి భారీ ఎత్తున వైస్సార్సీపీ నాయకులు బీజేపీ పార్టీ లో చేరికలు

కరప (జిఎస్ బి వార్త)

కాకినాడ లో ఆదివారం కాకినాడ జిల్లా అధ్యక్షులు బీజేపీ బిక్కిన విశ్వేశ్వరరావు  ఆధ్వర్యంలో కరప మండలం నుండి భారీ ఎత్తున వైస్సార్సీపీ నాయకులు బీజేపీ పార్టీ లోచేరారు. కరప మండలం కొంగోడు నుండి 40 మంది వరకు వైయస్సార్సీపి నుండి బిజెపిలో చేరారు . కరప మండల బీసీ సెల్ అధ్యక్షుడు కోట శ్రీను, పెనుగుదురు పి.ఎ.సిఎస్ డైరెక్టర్ చందాల శ్రీను  రాబోయే ఎన్నికల్లో కూటమి గెలుపే ప్రాముఖ్యతగా పనిచేస్తానని కోట శ్రీను తెలియజేశారు.బీసీ సెల్మం డల అధ్యక్షులు కోట శ్రీనివాస్  బీజేపీ లో చేరారు . వారితో పాటు పెనుగుదురు సొసైటీ మాజీ డైరెక్టర్ సందాల శ్రీను , కడలి దుర్గా ప్రసాద్ , అనుసూరి రమణమూర్తి  తదితరులు బీజేపీ పార్టీ కండువాలు కప్పుకున్నారు . స్థానిక సంస్థల ఎన్నికల్లో మోడీ సేవలను ప్రజలోకి తీసుకెళ్ళి స్థానిక సంస్థల్లో కూటమి విజయం కోసం పని చేస్తామన్నారు.