కరవాకులంకలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార జోరు ఎంపీటీసీ అభ్యర్థి పెసింగి వెంకన్నబాబుకు మద్దతుగా గడపగడపకు ప్రచారం అంబేద్కర్‌కు పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు

ఐ.పోలవరం, అక్టోబర్ 25 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ.పోలవరం మండలం కరవాకులంక గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి పెసింగి వెంకన్నబాబు ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతూ గడపగడపకు వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రచార కార్యక్రమానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో...