*కర్రి వానిరేవు విజయ దుర్గ అమ్మవారికి ఆషాడం సారె.
ముమ్మిడివరం .ఆగస్ట్ 09 ( జియస్ బి వార్త) మండలం కర్రివాని రేవు అగ్నికుల క్షత్రియ గ్రామంలో గ్రామస్తులు మాతృమూర్తులు ఆడపడుచులు, విద్యార్థులు గ్రామదేవతలు కాసులమ్మ ధనమ్మ, విజయదుర్గ అమ్మవార్లకు ఆషాడం సారె సమర్పించారు. ఆదివారం ఉదయం నుండి ముందుగా ఆడపడుచులు మంగళ వాయిద్యములతో వృద్ధ గౌతమి నది ఒడ్డుకు చేరి గంగామాతకు పసుపు కుంకుమ సమర్పించి గంగాజలమును తీసుకొని దేవాలయము చేరి విజయదుర్గ అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆడపడుచులు తీసుకొచ్చిన సారె సమర్పించారు....