కష్టపడి పనిచేసే లైన్‌మెన్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడం అన్యాయం కొమానపల్లి ప్రజల విద్యుత్ సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలి వెంటనే కొత్త లైన్‌మెన్‌ను నియమించాలి: కాశి రామకృష్ణ
ముమ్మిడివరం: సెప్టెంబర్ 05( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి) కొమానపల్లి గ్రామ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కష్టపడి పనిచేస్తున్న లైన్‌మెన్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగడంలో లైన్‌మెన్‌ల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలు, వైర్ల లోపాలు వంటి...