కాకినాడలో అంబరాన్నంటిన దేవీ శరన్నవరాత్రి వేడుకలు*  – *వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఘనంగా ‘రాగ దండియా ఉత్సవ్ 2.0* ’ – *సంప్రదాయం, ఆధునిక వినోదాల కలయికతో మార్మోగిన ద్వారంపూడి ఫంక్షన్ హాల్*  – *ప్రత్యేక ఆకర్షణగా బిగ్ బాస్ ఉదయ్ మాస్టర్ బృందం డ్యాన్స్ షోలు* 

కాకినాడ సిటీ అక్టోబర్ 19 జి ఎస్ బి వార్త కళలు, సంస్కృతికి నిలయమైన కాకినాడ నగరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల వేళ సరికొత్త సాంస్కృతిక శోభ వెల్లివిరిసింది. ప్రముఖ లగ్జరీ ఆభరణాల బ్రాండ్ 'వేగా జ్యువెలర్స్' ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నాగమల్లితోట జంక్షన్ సమీపంలోని ద్వారంపూడి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ‘రాగ దండియా ఉత్సవ్ 2.0’ అత్యంత వైభవంగా జరిగింది. సంప్రదాయ కళారూపాలతో పాటు ఆధునిక వినోదాన్ని మేళవించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర ప్రజలు, మహిళలు, యువతీ యువకులు భారీ సంఖ్యలో...