*కాకినాడలో ‘అస్మిత’ ఖేలో ఇండియా సౌత్ జోన్ *మహిళల హాకీ లీగ్* *అక్టోబర్ 27 నుంచి నవంబర్ 6 వరకు డీఎస్ఏ గ్రౌండ్లో పోటీలు** *తలపడనున్న 6 దక్షిణాది రాష్ట్రాల జూనియర్, సబ్-జూనియర్ జట్లు* *వివరాలు వెల్లడించిన కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు*
కాకినాడ సిటీ అక్టోబర్ 25 జి ఎస్ బి వార్త గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా 'అస్మిత' ఖేలో ఇండియా సౌత్ జోన్ జూనియర్, సబ్-జూనియర్ మహిళల లీగ్ హాకీ టోర్నమెంట్ను కాకినాడలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక డీఎస్ఏ (DSA) గ్రౌండ్లో అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఈ ప్రతిష్టాత్మక పోటీలు జరగనున్నాయి.హాకీ ఇండియా గుర్తింపు...