కాకినాడలో కోలాహలంగా ‘అమరావతి ఛాంపియన్‌షిప్–2026’ ప్రారంభం: 7 జిల్లాల నుంచి 600 మంది బాలికల భాగస్వామ్యం
కాకినాడలో కోలాహలంగా ‘అమరావతి ఛాంపియన్‌షిప్–2026’ ప్రారంభం: 7 జిల్లాల నుంచి 600 మంది బాలికల భాగస్వామ్యం కాకినాడ సిటీ ఆగస్టు 12 జి ఎస్ బి వార్త ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “అమరావతి ఛాంపియన్‌షిప్–2026” పోటీలు స్థానిక కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (DSA) మైదానంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడు జిల్లాల నుంచి విచ్చేసిన దాదాపు 600 మంది బాలికలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.అండర్–17, అండర్–23 విభాగాల్లో మొత్తం 12 రకాల క్రీడాంశాల్లో ఈ...