vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 3:36 am Posted by : వార్తా జిఎస్‌బి

కాకినాడలో ఘనంగా దేశభక్తి ర్యాలీ: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ

కాకినాడలో ఘనంగా దేశభక్తి ర్యాలీ: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ

కాకినాడ సిటీ ఆగస్టు 12 జి ఎస్ బి వార్త 

ముఖ్యమంత్రి ఆదేశాలు, జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడమే లక్ష్యంగా కాకినాడలో బుధవారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు.​కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ రాజా ట్యాంక్ వరకు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. ఇందులో అధికారులు, సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. రాజా ట్యాంక్ వద్దకు చేరుకున్న అనంతరం కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ హాజరైన వారందరిచే స్వాతంత్ర్య దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడూతూ భారతదేశ పౌరులుగా ఉండటం ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన విషయం. రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూ నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి నాడు సమరయోధులు చేసిన త్యాగాలే కారణం. వారి పోరాట పటిమను, కీర్తిని నేటి తరానికే కాకుండా భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది” అని పేర్కొన్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఇటువంటి దేశభక్తి కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కే.టీ. సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కే. శ్రీనివాస్, ఎస్.ఈ. పి. వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వి చరణ్, డేటా ఆఫీసర్ చక్రవర్తి, డి.ఈ. లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.