vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 4:59 am Posted by : వార్తా జిఎస్‌బి

కాకినాడ 9వ డివిజన్‌లో మున్సిపల్ కమిషనర్ పర్యటన: సమస్యల తక్షణ పరిష్కారానికి ఆదేశాలు

కాకినాడ సిటీ ఆగస్టు 28 జి ఎస్ బి వార్త
నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆదేశాల మేరకు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌.వి.వి. సత్యనారాయణ 9వ డివిజన్ పరిధిలోని రామమోహన్ రాజ్ నగర్‌లో శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, వీధి దీపాల పరిస్థితిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. 9వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ లూటుకుర్తి మోహన్ , కాలనీ ప్రెసిడెంట్ తులసి మోహన్, తదితరులు స్థానిక సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
పర్యటన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు, పొదలను స్థల యజమానులే వెంటనే తొలగించాలని సూచించారు. మున్సిపల్ హార్టికల్చర్ సిబ్బందితోనూ శుభ్రం చేయిస్తున్నట్లు తెలిపారు.
ఆక్రమణలపై చర్యలు: రోడ్లు, డ్రైనేజీలను ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టినా, వస్తువులు ఉంచినా నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పశువుల పేడ, వ్యర్థాలను డ్రైనేజీల్లోకి వదిలితే జరిమానాలు విధిస్తామన్నారు. పశువులను రోడ్లపైకి వదలకుండా యజమానులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. డివిజన్‌లో తాగునీటి నాణ్యత బాగుందని, వీధి దీపాల సమస్యలపై ఫిర్యాదు అందిన 10 గంటల్లోపు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని కోరారు. అనంతరం 9వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ లూటుకుర్తి మాట్లాడుతూ కాకినాడను ‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ’గా మార్చే లక్ష్యంతో స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వారు నగరంలోని డంపింగ్ యార్డ్‌ను తరలించినప్పటికీ, 9వ వార్డులోని అక్షర స్కూల్ ఎదురుగా, భూపతి నగర్ నుంచి దుగ్గానగర్ వెళ్లే రోడ్డుకి ఇరువైపులా కొంతమంది చెత్తను డంప్ టిడిపి ఇంచార్జ్ మోహన్ కమిషనర్ దృష్టికి . దీనివల్ల స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వివరించారు. గతంలో ప్రజా దర్బార్ (PGRS) ద్వారా ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని గుర్తుచేశారు.
దీనిపై కమిషనర్ తక్షణమే స్పందించి, అక్కడ పేరుకుపోయిన చెత్తను తరలించేందుకు టెండర్లు పిలిచి తగిన చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. సమస్యపై సానుకూలంగా స్పందించినందుకు ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు వారికి మరియు మున్సిపల్ కమిషనర్‌ వారికి వార్డు ప్రజల తరఫున లూటుకుర్తి మోహన్ ధన్యవాదాలు తెలిపారు అనంతరం రాఖీ పౌర్ణమి సందర్భంగా పర్యటనకు విచ్చేసిన కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పృథ్వీ చరణ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాయుడు, వార్డు ప్రతినిధులకు కాకినాడ పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి లీలా ప్రశాంతి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ ప్రవీణ్ చంద్ర, ఏఈలు అర్జున్, రత్నవలి, కాకినాడ పార్లమెంట్ లీలా ప్రశాంతి, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, ఇతర సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.