కాకినాడ 9వ డివిజన్‌లో మున్సిపల్ కమిషనర్ పర్యటన: సమస్యల తక్షణ పరిష్కారానికి ఆదేశాలు
కాకినాడ సిటీ ఆగస్టు 28 జి ఎస్ బి వార్త నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆదేశాల మేరకు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ 9వ డివిజన్ పరిధిలోని రామమోహన్ రాజ్ నగర్‌లో శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, వీధి దీపాల పరిస్థితిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. 9వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ లూటుకుర్తి మోహన్ , కాలనీ ప్రెసిడెంట్ తులసి మోహన్, తదితరులు స్థానిక సమస్యలను కమిషనర్ దృష్టికి...