vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:40 am Posted by : వార్తా జిఎస్‌బి

కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ముమ్మిడివరం 15వ వార్డులో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన పొన్నాడ

కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే పొన్నాడ 

ముమ్మిడివరం, నవంబర్ 1 (జీఎస్‌బీ వార్త – రిపోర్టర్ వేణు కాశి):

ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీలోని 15వ వార్డులో కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటు వేశారు.

ఈ సందర్భంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవచ్చనే సందేశాన్ని ఆయన చాటారు.

నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించాయి.

జీఎస్‌బీ వార్త | ప్రజల పక్షాన – పోరాటం | నిజాన్ని నిర్భయంగా