vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 12:18 pm Posted by : వార్తా జిఎస్‌బి

కూటమి అభ్యర్థులతో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సమావేశం ఎన్నికల నిర్వహణ, ప్రచార సరళిపై దిశానిర్దేశం.. అభ్యర్థుల మధ్య సమన్వయానికి సూచనలు

  ఐ . పోలవరం             మురమళ్ల, నవంబర్ 1 (జీఎస్‌బీ వార్త – రిపోర్టర్ వేణు కాశి):

ఐ. పోలవరం (  జీఎస్ బి వార్త  నవంబర్ 01 ) ఐ. పోలవరం  మండలం లో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థులతో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) సమావేశమయ్యారు. మురమళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మండలానికి చెందిన కూటమి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో ఎన్నికల కార్యాచరణ, ప్రచార నిర్వహణ, పార్టీల మధ్య సమన్వయంపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అభ్యర్థులకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి అభ్యర్థి తమ పరిధిలోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలని తెలిపారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల సహకారంతో సమన్వయపూర్వకంగా ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.

అలాగే అభ్యర్థులందరూ పరస్పర సహకారంతో ఎన్నికల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం కొనసాగించాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్దేశించుకున్న కార్యాచరణ ప్రకారం ముందుకు సాగాలని తెలిపారు.

ఈ సమావేశంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి, ఐ. పోలవరం మండల పార్టీ అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబు రాజు, రాయపురెడ్డి నీలకాంటేశ్వరరావు, తాడి నరసింహారావు, మద్దింశెట్టి పురుషోత్తం, బీర సత్యకుమారి, గాదిరాజు కృష్ణంరాజు, సఖీరెడ్డి శ్రీనివాస్, బొంతు శ్రీరాములు, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

జీఎస్‌బీ వార్త | ప్రజల పక్షాన – పోరాటం | నిజాన్ని నిర్భయంగా