కె. గంగవరం జెడ్పీటీసీ రేసులో కొండేపూడి చంటిబాబు! రామచంద్రపురం నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారిన రాజకీయ పరిణామాలు
కె. గంగవరం, జీఎస్బీ వార్త: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని కె. గంగవరం మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిత్వంపై రాజకీయ చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కొండేపూడి చంటిబాబు పేరు జెడ్పీటీసీ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. మండలంలోని వివిధ సామాజిక వర్గాలతో ఆయనకు పరిచయాలు, సంబంధాలు ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గంలో ఆయనకు మంచి పరిచయాలు, ఆదరణ ఉన్నట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ స్థానికంగా తనకంటూ గుర్తింపు...