కేసనకుర్రులో అభివృద్ధి పనులకు శ్రీకారం పల్లె పండుగ 3.0లో రూ.2.67 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన — ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు
ఐ.పోలవరం, అక్టోబర్ 6 (జీఎస్బీ వార్త): కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా ఐ.పోలవరం మండలం కేసనకుర్రు పంచాయతీ పరిధిలో రూ.2.67 కోట్ల విలువైన సుమారు 20 అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో రోడ్లు, డ్రైన్లు, సిమెంట్ రోడ్లు, తాగునీటి సదుపాయాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. జాంబవానిపేట, పేర్రాజు చెరువుల్లో నిర్మించిన వాటర్ ట్యాంకులను ప్రారంభించడంతో పాటు, జాంబవానిపేట...