vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 7:49 am Posted by : వార్తా జిఎస్‌బి

గణేష్ మండపాల ఏర్పాటుకు చలనాలు అవసరం లేదు

ఐ.పోలవరం ఆగస్ట్ 04( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి )గణేష్ మండపాల ఏర్పాటుకు ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా సులభంగా పొందవచ్చని తెలిపారు.

మండపాల నిర్వాహకులు అవసరమైన అనుమతుల కోసం ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, భద్రతాయుతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసు శాఖ సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసు శాఖ ఉన్నత అధికారులు ప్రకటన విడుదల చేశారు