vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 6:27 am Posted by : వార్తా జిఎస్‌బి

గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ  సీఐ కృష్ణ చైతన్య పరిశీలన

గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ

సీఐ కృష్ణ చైతన్య పరిశీలన

 

కాజులూరు( జిఎస్ బి వార్త) , సెప్టెంబర్ 7

గొల్లపాలెంలో కాకినాడ- కోటిపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న జిల్లా సహకార బ్యాంకు చెందిన ఏటీఎం పగలగొట్టి నాలుగు లక్షల 35 వేల 500 రూపాయలు నగదు గుర్తుతెలియని వ్యక్తులుచోరీకి పాల్పడ్డారు. ఈ మేరకు విషయాన్ని సోమవారం గొల్లపాలెం ఎస్పై ఆర్.వి.ఎన్. మూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 5వ తేది శనివారం సాయంత్రం బ్యాంకు కార్యకలాపాలు ముగించుకుని 7 వ తేది ఉదయం 10 గంటలకు బ్యాంకు తెరిచే సమయంలో గొల్లపాలెం గ్రామంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో జరిగిందని పేర్కొన్నారు. వెంటనే ఈ విషయం గొల్లపాలెం పోలీసులకు బ్యాంకు ఇన్చార్జ్ మేనేజర్ గొల్లపల్లి ఫకీర్రావ్ ఫిర్యాదుచేశారు. దీంతో పకీర్ రావు, ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఫిర్యాదుదారుడు ఫకీర్రావ్ బ్యాంకు ప్రాంగణం తోపాటు బ్యాంకు భవనం పశ్చిమ వైపున ఉన్న ఏటీఎంకు తాళం వేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో సోమవారం ఉదయం సుమారు 9:30 గంటల సమయానికి ఫకీర్రావ్ బ్యాంకు వద్దకు వచ్చి షట్టర్ తెరవడానికి ప్రయత్నించగా, ఏటీఎం షట్టర్ వద్ద ఒక ఇనుప రాడ్ (క్రోబార్) పడి ఉ ండటాన్ని గమనించి నట్లు పేర్కొన్నారు. ఏటీఎం షట్టర్ తెరిచి చూడగా, గుర్తుతెలియని నిందితులు ఏటీఎం యంత్రాన్ని బలవంతంగా పగులగొట్టి, అందులోని రూ.4,35,500 రూపాయలు నగదును చోరీ చేసినట్లు గుర్తించారు. అనంతరం పరిస్థితి పరిశీలించగా, నిందితులు బ్యాంకు భవనం వెనుక వైపున ఉన్న కిటికీ గ్రిల్ను పగులగొట్టి, దాని ద్వారా బ్యాంకు లోపలికి ప్రవేశించి, విద్యుత్ సరఫరాను డిస్కనెక్ట్ చేసి బిసి టవి కెమెరాలను సైతం తెలివిగా ఆఫ్ చేసి, చోరీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం నిందితులు చోరీ చేసిన సొత్తుతో సంఘటనా స్థలం నుండి పరారయ్యారుని చోరీకి గురైన నగదుతోపాటు ఇతర వస్తువుల మొత్తం విలువ సుమారుగా రూ.4,35,500 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఈచోరిపై గొల్లపాలెం ఎస్సై ఆర్ .వి .ఎన్. మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు. సోమవారం సంఘటనా స్థలానికి కాకినాడ రూరల్ సిఐ చైతన్య క్రిష్ణ చేరుకుని పరిస్థితిని గమనించి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టి పరిశీలించారు.