గొల్లప్రోలులో భారీ చోరీ
.. 204 గ్రాముల బంగారం, 86 తులాల వెండి అపహరణ
.. రంగంలోకి క్లూస్ టీం
(పిఠాపురం, జి ఎస్ బి వార్త )
గొల్లప్రోలు దేవీ నగర్లో భారీ చోరీ చోటు చేసుకుంది. పట్తణంలో గోనె సంచుల వ్యాపారి ఊటుకూరి సుబ్బారావు ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. సుబ్బారావు ఇంట్లో అందరూ పిఠాపురం సినిమాకు వెళ్లడంతో అదను చూసిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోని బంగారం, వెండి నగలు అహపరించారు. ఈ మేరకు సుబ్బారావు గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా నుంచి వచ్చి చూసే సరికి ఇంటి తలుపులు అన్నీ తీసి వున్నాయని ఇంట్లో వస్తువులు చిందరవందరగా వున్నాయని తన ఫిర్యాదులో తెలిపారు. ఇంట్లోని సుమారు 204 గ్రాముల బంగారం, 86 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బంగారం వెండి వస్తువులతో పాటూ రూ.25వేలు దుండగులు అపహరించినట్లు తెలిపారు. ఇదిలా వుండగా చోరీ ఫిర్యాదు అందగానే పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. పోలీస్ జాగిలాలను దర్యాప్తులో వినియోగించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.