vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 11:28 am Posted by : వార్తా జిఎస్‌బి

ఘనంగా పిన్నమరాజు వెంకటపతిరాజు జన్మదిన వేడుకలు _

ఐ. పోలవరం, ఆగస్టు 29 (జియస్‌బి వార్త): ఐ. పోలవరం మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు (శ్రీను రాజు) జన్మదిన సందర్భంగా అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్రీను రాజు మరిన్ని ఉన్నత స్థాయిలకు చేరుకుని, ప్రజలకు సేవ చేయాలని ఆమె ఆకాంక్షించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సత్యం కాపు, అంబికా శ్రీను, కాశి వెంకటరమణ, దాసరి గౌతమ్, ఇందుకూరి రంగరాజు, పసుపులేటి అర్జునరావు, మట్టా చిట్టి, మట్టా శివకుమార్, మట్టా నాగేశ్వరరావు, ఓలేటి శీను తదితరులు పాల్గొని పిన్నమరాజు వెంకటపతిరాజుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.