జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా గ్లోరీ మేడమ్‌కు ఘన సత్కారం విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా అంకితభావంతో సేవలు.. విద్యా రంగంలో విశిష్ట గుర్తింపు
కాట్రేనికోన: సెప్టెంబర్ 05 (జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తున్న కాట్రేనికోన మండలం సావరం MPPS (ZPHS చెయ్యేరు క్లస్టర్) పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి సిహెచ్. గ్లోరీ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికై అవార్డు అందుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ఈ పురస్కారం లభించడం పట్ల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, చెయ్యేరు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా...