vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 2:52 pm Posted by : వార్తా జిఎస్‌బి

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఐ.పోలవరం మండల ఉపాధ్యాయులు


  1. ఐ.పోలవరం, సెప్టెంబర్ 5: ( జీఎస్ బి వార్త రిపోర్టర్  వేణు కాశి).ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గోదావరి భవన్‌లో శనివారం నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఐ.పోలవరం మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.

    ఐ.పోలవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నక్కా ప్రసాద్ కుమార్కు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు లభించింది. అలాగే మండల ప్రజా పరిషత్ పాఠశాల, పల్లిపాలెం ఉపాధ్యాయులు శ్రీ జున్నుపూడి సుకుమార్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.

    జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఇరువురు అవార్డులను స్వీకరించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాలల పురోగతికి వారు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్డులు లభించడం పట్ల ఐ.పోలవరం మండల విద్యా వర్గాల్లో హర్షం వ్యక్తమైంది.

    ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి-1 మోర్తా డేవిడ్, స్థానిక హైస్కూల్ హెచ్‌ఎం వీధి సురేష్ బాబు, ఎస్‌టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ నాయకులు అవార్డు గ్రహీతలను అభినందించారు. అలాగే సీఆర్‌ఎంటీలు, వివిధ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేశారు.

    ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకోవడం ద్వారా ఐ.పోలవరం మండలానికి గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.