టీ. కొత్తపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల జోరు! ఎంపీటీసీ-1కు బుంగా జ్యోతి రాజేష్.. ఎంపీటీసీ-2కు గాదోమ్మేటి వెంకట దుర్గా ప్రసాద్ నామినేషన్లు దాఖలు పార్టీ నేతలు కోరుకొండ సత్యనారాయణ (డిల్లీ నారాయణ) తదితరుల హాజరు

ఐ. పోలవరం, అక్టోబర్ 23 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ. పోలవరం మండలం టీ. కొత్తపల్లి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థులు శుక్రవారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. గ్రామంలోని ఎంపీటీసీ స్థానాలకు పార్టీ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించడంతో స్థానికంగా ఎన్నికల సందడి నెలకొంది. టీ. కొత్తపల్లి ఎంపీటీసీ-1 స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బుంగా జ్యోతి రాజేష్, ఎంపీటీసీ-2 స్థానానికి గాదోమ్మేటి...