vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 9:07 am Posted by : వార్తా జిఎస్‌బి

టీ. కొత్తపల్లి ఎంపీటీసీ-2కు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గాదోమ్మేటి వెంకట దుర్గా ప్రసాద్ నామినేషన్

వైఎస్సార్‌సీపీ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ) సమక్షంలో నామినేషన్ దాఖలు

ఐ. పోలవరం, అక్టోబర్ 23 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ. పోలవరం మండలం టీ. కొత్తపల్లి గ్రామ ఎంపీటీసీ-2 స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాదోమ్మేటి వెంకట దుర్గా ప్రసాద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ), వడ్డీ గౌతమ్, పండు విజయకుమార్, పచ్చిమాల విజయ్ కుమార్, సూర్యనారాయణ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.