*డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన* :       *విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామాకు డిమాండ్* 

డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పర్యవేక్షణలో, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ యువజన, విద్యార్థి రంగాలు సంయుక్తంగా కాకినాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి.ఈ...